Saturday, June 05, 2021

ఉద్యోగి మరణించిన నెలకే కుటుంబ పెన్షన్ - కేంద్రం

ఉద్యోగి మరణించిన నెలకే కుటుంబ పెన్షన్ అందజేయాలని కేంద్రం ఆదేశించింది.


ఉద్యోగి మరణించిన నెలకే కుటుంబ పెన్షన్ - కేంద్రం


న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగి మరణించిన నెల రోజుల్లోనే కుటుంబ సభ్యులకు పెన్షన్ అందజేయాలని కేంద్రం ఆదేశించింది. పెన్షన్ల విభాగం, పెన్షనర్ల సంక్షేమ సంఘం ఈ విషయమై కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. 




పాత పెన్షన్ పథకం కింద ఉన్న, జాతీయ పెన్షన్ వ్యవస్థలో ఉన్న మరణించిన ప్రభుత్వోద్యోగికి రావాల్సిన అన్ని మొత్తాలను ఆ కుటుంబానికి చెల్లించాలని పేర్కొంది. దీంతోపాటు ఉద్యోగి చెల్లించిన మొత్తాన్నీ, ఎన్పీఎస్ పెన్షన్ కార్పస్నూ కుటుంబ సభ్యులకు చెల్లించాలని తెలిపింది. కుటుంబ పెన్షన్ను ప్రారంభిస్తున్నప్పుడే ఎన్పీఎస్ కిందనున్న ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య మూసివేయాలని సూచించింది.

ఉద్యోగి మరణించిన నెలకే కుటుంబ పెన్షన్ - కేంద్రం

0 వ్యాఖ్యలు:

Post a Comment