Wednesday, June 16, 2021

ఏపీ ప్రజలకు ఊరట భారీగా తగ్గిన పాజిటివ్ రేట్. సోమవారం నుంచి సడలింపులు!

ఏపీ ప్రజలకు ఊరట భారీగా తగ్గిన పాజిటివ్ రేట్. సోమవారం నుంచి సడలింపులు!  | రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ రేటు బాగా తగ్గింది. సోమవారం నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిచింది


ఏపీ ప్రజలకు ఊరట భారీగా తగ్గిన పాజిటివ్ రేట్. సోమవారం నుంచి సడలింపులు!


ఏపీ ప్రజలకు ఊరట లభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ రేటు బాగా తగ్గింది. సోమవారం నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిచింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.




ఆంధ్రప్రదేశ్ లో కఠిన కర్ఫ్యూ అద్భుత ఫలితం ఇస్తోంది. అలాగే వ్యాక్సినేషన్ తో సహా కోవిడ్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ఫ్యూకు తోడు మూడు రోజులకు ఒకసారి ఫీవర్‌ సర్వే నిర్వహించడం.. కోవిడ్‌ లక్షణాలున్న వారిని గ్రామాల పరిధిలోనే ఐసొలేట్‌ చేస్తుండటంతో కరోనా కట్టడి అవుతోంది.

మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జాతీయ సగటును మించి జోరుగా సాగుతుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య, శాతం గణనీయంగా తగ్గింది. గత నెల మే 16న ప్రతి 100 టెస్టుల్లో 25.56% మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 94,550 మందికి పరీక్షలు చేయగా 24,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

అంత ప్రమాదకర పరిస్థితి నుంచి ఇప్పుడు రోజుకు 5 వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం 96,153 టెస్టులు చేయగా 5,741 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 5.98 శాతం మాత్రమే నమోదైంది.

రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణ చర్యలతోపాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ విషయంలో జాతీయ సగటుని మించి ఏపీ ముందుకు దూసుకెళ్తోంది. దేశంలో ఒక్కరోజులో 6.28 లక్షల డోసుల టీకాను వేసిన రాష్ట్రంగా ఏపీ ఇప్పటికే రికార్డు సాధించింది. ఇవన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కేసులకు అటు ఇటుగా నమోదు అవుతూ ఉన్నాయి. మరణాలు మాత్రం తగ్గకపోవం కాస్త కలవర పెడుతోంది.

తాజా పరిస్థితులు నేపథ్యంలో ఇకపై మరిన్ని సడలింపులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ ఈ నెల 20వ తేదీతో ముగుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఇస్తున్నారు. మిగిలిన సమయంలో కఠినంగా కర్ఫ్యూ విధిస్తున్నారు.

సోమవారం నుంచి సడలింపులను సాయంత్రం 6 గంటల వరకు పెంచడం.. లేదా రాత్రి కర్ఫ్యూ మాత్రం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీనీపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే కర్ఫ్యూను మాత్రం మరో వారం రోజుల పాటు.. లేదా ఈ నెల ఆఖరు వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వివాదాస్పందంగా మారిన పరీక్షల నిర్వహణపైనా ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ పరీక్షలు జులై మొదటి వారంలో.. పది పరీక్షలు ఆఖరి వారంలో ఉంటాయని స్పస్టత ఇచ్చారు. దీనిపై సీఎం జగన్ అధికారులతో చర్చించి తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీ ప్రజలకు ఊరట భారీగా తగ్గిన పాజిటివ్ రేట్. సోమవారం నుంచి సడలింపులు!

0 వ్యాఖ్యలు:

Post a Comment