Sunday, June 06, 2021

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతి ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతి ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము| ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతి ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతి ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లా తో సహా) 2021-22. విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను జిల్లావారీగా సంబంధిత జిల్లా కలెక్టరు వారి కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా తేదీ 14-07-2021 న ఎంపిక చేసి ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు కౌన్సిలింగ్ ద్వారా జరుగును.




ప్రవేశానికి అర్హత వయసు: ఓ.సి మరియు బి.సి (O.C., B.C) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. 

యస్.సి. మరియు యస్.టి (SC.ST) లకు చెందిన వారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.  సంబంధిత జిల్లాలో 2019-20 & 2020-21 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.

O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంత MINORITY, S.C మరియు S.T. విద్యార్థులు జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

ఆదాయపరిమితి అభ్యర్థి యొక్క తల్లి,తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2020-21) రూ.1,00,000/- మించి ఉండరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు. II. పాఠ శాలలో ప్రవేశము

2021-22 విద్యా సంవత్సరము నకు అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక ప్రవేశ పరీక్ష బదులు లాటరీ పద్ధతి ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారిచే ఏర్పాటు చేయబడిన కమిటీ సమక్షంలో జరుపబడును. 

విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిగణింపబడుతుంది. 

జిల్లా లోని సాధారణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆ జిల్లా లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు

మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా. 

ఈ క్రింది రీజిఒనల్ సెంటర్స్ అఫ్ ఎక్స్ట్రాన్సు పాఠశాలల్లో అభ్యర్థి ఐచ్చికత,

ప్రాంతము మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు: 1. తాడికొండ (గుంటూరు జిల్లా) 8 కోస్తా జిల్లాలవారు (నెల్లూరు తప్పు) .కొడిగెనహళ్ళి (అనంతపురం జిల్లా) 4. రాయలసీమ జిల్లాలు & నెల్లూరు జిల్లా వారు అర్హులు

దరఖాస్తు దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు https://aprs.apcts.in ను చూడగలరు. III. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం: లాటరీలో ఎంపికైన అభ్యర్థులకురిజర్వేషన్షన్ వివరాలు పట్టిక (1) నందు ఇవ్వబడినవి). 

స్థానికత, ప్రత్యేక కేటగిరి (మైనారిటీ/అనాథ/సైనికోద్యోగుల పిల్లలు మరియు ఏదేనీ ఒక రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేని యెడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు. మైనారిటీ పాఠశాలలకు చెందిన ఖాళీలను మైనారిటీ అభ్యర్థులతో మాత్రమే నింపుతారు. ఈ పాఠశాలల మైనారిటీ ఖాళీలను వేరే ఏ కేటగిరి వారికి కేటాయించారు.

ప్రత్యేక కేటగిరిలకు సంబంధించిన అంగవైకల్యం అనాధ మరియు సైనికోద్యోగుల పిల్లలు) ఖాళీలు మిగిలినచో అట్టి ఖాళీలను మెరిట్ ప్రాతిపదికన ఓపెన్ క్యాటగిరి వారికి కేటాయిస్తారు.

జిల్లాలవారీగా పాఠశాలల వివరాలు, ఆ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హతగల జిల్లాలు పటిక (2) నందు ఇవ్వబడినవి. 

ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థ అధికారం ఉంది. 


దరఖాస్తు చేయు విధానం:


అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెంది ప్రాధమిక వివరాలతో 

అభ్యర్థి పేరు, 

పుట్టినతేది, 

మొబైల్ నెంబర్ మరియు 

సంతకంతో కూడిన పాస్పోర్ట్ సైజు ఫోటో) ఆన్ లైన్ ద్వారా రూ. 50/- చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది. 

జర్నల్ నెంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకొన్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియచేయు నెంబరు మాత్రమే. ఆ జర్నల్ నెంబరు ఆధారంగా https://aprapcfss.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జర్నల్ నెంబరును ఫీజు చెల్లించిన కాలామ్ లో నమోదు చేయవలెను క్రెడిట్ కార్డు సౌకర్యం కలవారు అట్టి కార్డు ద్వారా కూడా సులభంగా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చును.

గడువు ఆన్లైన్ ద్వారా ది 06-06-2021 నుండి తేది 30-06-2021 వరకు పైన తెలిపిన వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకో వచ్చును.

ఆన్ లైన్ లో దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబరు ఇవ్వబడును. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.

నమూనా దరఖాస్తు ఫారం పట్టిక (3) లో ఇవ్వబడినది. దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకొని ఒక పాస్పోర్ట్ సైజ్ (B.Scmx4.5cm) ఫోటోను కూడా సిద్ధము చేసుకొనవలెను. 

ప్రవేశ సమయానికల్లా అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరి ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ ధృవీకరణ, పుట్టిన తేదీ ధృవీకరణ మొదలగు పత్రాలు ఒరిజినల్) పొందియుండాలి. ధృవపత్రాల ఒరిజినల్స్ ప్రవేశ సమయంలో సమర్పించాలి. లేని యడల విద్యార్థి ఎంపిక కాబడినను ప్రవేశము కల్పి

ఆన్ లైన్ లో కాక నేరుగా సంస్థకు గాని, గురుకుల పాఠశాలలకు గాని పంపిన దరఖాస్తులను పరిశీలించారు. అట్టి అభ్యర్థులు లాటరీ కి అనుమతింపబడరు.అర్హతలేని అభ్యర్థులు దరఖాస్తులు తిరస్కరించబడును.

ఆన్ లైన్ ద్వారా ది.06-06-2021 నుండి తేది 30-06-2021 లోగా రుసుము రూ. 50/ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. నింపిన దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా వెంటనే తప్పనిసరిగా సమర్పించ వలెను. దరఖాస్తు చేయు విధానంలో సందేహ మున్నచో కార్యాలయ పనివేళలు ఉ. 10:00 నుండి సాయంత్రం 5.30 గం. లోపు ఈ ఫోన్ నెంబర్లలో 9676404618, 7093323249, మరియు 9866559725 సంప్రదించ

దరఖాస్తు నింపుటలో అభ్యర్థులకు కొన్ని ముఖ్య సూచనలు


దరఖాస్తుని ఆన్ లైన్ లో పంపడానికి ముందుగా నమూనా దరఖాస్తును నింపుకోవాలి

పాఠశాల లు ఎంచుకొనడానికి ముందు పాఠశాలల వివరాల పట్టికను చూచుకొని

పాస్ పోర్ట్ సైజు ఫోటో (3.5cmoot.5cm) నుసిద్దంగా ఉంచుకోవాలి. 

దరఖాస్తును నింపునప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. 

దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్థి యే పూర్తి బాధ్యత వహించాలి.

తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.

ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావులేదు. కావున దరఖాస్తు అప్ లోడ్ చేయుటకు ముందే సరిచూచుకోవాలి.


More information about official website at


ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో లాటరీ పద్ధతి ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము

0 వ్యాఖ్యలు:

Post a Comment