Saturday, June 05, 2021

ఆదివారమైనా ఖాతాలో జీతం జమ ఆగస్టు 1 నుంచి రోజూ ‘నాచ్‌’ సేవలు

ఆదివారమైనా ఖాతాలో జీతం జమ ఆగస్టు 1 నుంచి రోజూ ‘నాచ్‌’ సేవలు| nach: అన్ని రోజులు నాచ్‌ అందుబాటులోకి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహణలోని నాచ్‌.. బల్క్‌ పేమెంట్‌ వ్యవస్థ. ఆటో క్రెడిట్‌ సేవలతో పా టు విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్‌, రుణ కిస్తీలు (ఈఎంఐ), మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, బీమా ప్రీమియం ఆటో డెబిట్‌ సేవలనూ అందిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), సబ్సిడీ చెల్లింపులు సైతం ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి.


ఆదివారమైనా ఖాతాలో జీతం జమ ఆగస్టు 1 నుంచి రోజూ ‘నాచ్‌’ సేవలు


అకౌంట్లో జీతం జమయ్యే రోజు ఆదివారం లేదా బ్యాంక్‌ సెలవు దినమైతే ఉద్యోగికి ఉసూరే. వేతనం సొమ్ము ఖాతాలో క్రెడిట్‌ అయ్యేందుకు బ్యాంకింగ్‌ సేవలు పునఃప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే. ఎందుకంటే, ఒక ఖాతా నుంచి పలు ఖాతాల్లోకి జీతాలు, ఫించను, వడ్డీ, డివిడెండ్‌ను జమ చేసే నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ (ఎన్‌ఏసీహెచ్‌-నాచ్‌) ప్రస్తుతం బ్యాంక్‌ పని దినాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.




ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నాచ్‌ వారంలో అన్ని రోజులూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహణలోని నాచ్‌.. బల్క్‌ పేమెంట్‌ వ్యవస్థ. ఆటో క్రెడిట్‌ సేవలతో పా టు విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్‌, రుణ కిస్తీలు (ఈఎంఐ), మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, బీమా ప్రీమియం ఆటో డెబిట్‌ సేవలనూ అందిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), సబ్సిడీ చెల్లింపులు సైతం ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి.

nach: అన్ని రోజులు నాచ్‌ అందుబాటులోకి.

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగుల జీతాల వంటి భారీ చెల్లింపులు నిర్వహించే ది నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ సిస్టమ్‌ (నాచ్‌) ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని రోజులు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకులు తెరిచిన రోజుల్లోనే అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల సేవలను మరింత బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని కేంద్ర బ్యాంక్‌ పేర్కొంది.

నాచ్‌ చెల్లింపుల విధానం ఒకరి నుంచి పలువురికి డబ్బులు బదిలీ చేయవచ్చు. ఉదాహరణకు జీతాలు, పింఛన్లు, వడ్డీలు, డివిడెండ్‌లు వంటివి చెల్లించేందుకు వాడతారు. డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానం వచ్చాక నాచ్‌ నమ్మకమైన, సమర్థవంతమైన మార్గంగా మారిందని ఆర్‌బీఐ ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్‌ సమయంలో కూడా ప్రభుత్వ సబ్సిడీలు చెల్లించడానికి ఉపయోగపడింది.  దీంతోపాటు గ్యాస్‌, విద్యుత్తు, టెలిఫోన్‌, వాటర్‌, వాయిదాల చెల్లింపులకు కూడా వాడతారు.

ప్రస్తుతం నాచ్‌ కేవలం బ్యాంకు పనిదినాల్లో మాత్రమే ఉపయోగపడుతోంది. ఇప్పటికే ఆర్టీజీఎస్‌ అన్ని రోజులు అందుబాటులోకి రావడడంతో నాచ్‌ను కూడా అన్ని రోజులు పనిచేసేలా చేయాలని ప్రతిపాదిస్తున్నాం. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది’’ అని ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది

ఆదివారమైనా ఖాతాలో జీతం జమ ఆగస్టు 1 నుంచి రోజూ ‘నాచ్‌’ సేవలు

0 వ్యాఖ్యలు:

Post a Comment