AP పదో తరగతి పరీక్షలు వాయిదా/ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ/టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం
AP పదో తరగతి పరీక్షలు వాయిదా
అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జులైలో మళ్లీ పరీక్షలపై సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే కొవిడ్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది
ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ/టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ
- ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
- టీచర్లకు వ్యాక్సిన్ పూర్తయ్యాకే పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
- టెన్త్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
- లిఖిత పూర్వకంగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
- తదుపరి విచారణ జూన్ 18కి హైకోర్టు వాయిదా వేసింది.
0 వ్యాఖ్యలు:
Post a Comment