Thursday, November 12, 2020

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీల నమోదుకు అవకాశం

 నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీల నమోదుకు అవకాశం హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఒక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ ఎనిమిది సంవత్సరాల సర్వీస్‌ పూర్తయిన ఉపాధ్యాయులు, అయిదేళ్లు సర్వీస్‌ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్‌ప్లస్‌ అయిన పోస్టులలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీలకు నమోదు చేసుకోవాల్సి ఉంది.

 నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీల నమోదుకు అవకాశం

కడప ఉపాధ్యాయ బదిలీలకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. అడ్‌హక్‌ పదోన్నతుల ప్రక్రియతో మొదలై ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చర్యకు చేరుకుంది. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఒక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ ఎనిమిది సంవత్సరాల సర్వీస్‌ పూర్తయిన ఉపాధ్యాయులు, అయిదేళ్లు సర్వీస్‌ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్‌ప్లస్‌ అయిన పోస్టులలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీలకు నమోదు చేసుకోవాల్సి ఉంది. రెండేళ్ల సర్వీస్‌ ఒకే పాఠశాలలో పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులూ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ బుధవారం రాత్రి పొద్దుపోయేవరకూ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కొనసాగింది. 




విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులు, అవసరమైన ఉపాధ్యాయులను గుర్తించిన అనంతరం సర్దుబాటు చేయగా, మిగిలిన ఖాళీలను ఆన్‌లైన్‌లో ప్రదర్శించనున్నారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ నవంబరు 3వ తేదీ నాటికి చైల్డ్‌ఇన్‌ఫోలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపడుతున్నారు.

 పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తరువాత ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో బదిలీలకు ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంది

జిల్లాలో ఒక ప్రధానోపాధ్యాయులు హేతుబద్ధీకరణ మిగులుగా, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 250 పోస్టులు మిగులుగా తేలినట్లు సమాచారం. వీటిని కొత్తగా ఉన్నతీకరించిన ఉన్నత పాఠశాలలకు, అవసరం ఉన్న ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. ఒక పాఠశాలలో సర్‌ప్లస్‌ అవుతున్న పోస్టులో ఎల్‌ఎఫ్‌ఎల్‌ లాంగ్‌ స్టాండ్‌ అయిన వారిని, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ఖాళీ పోస్టులను జిల్లాలోని ఎస్జీటీ పోస్టులు అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. డీఈవోపూల్‌లో ఉన్న భాషోపాధ్యాయులు, పీఈటీలను బదిలీల అనంతరం అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నట్లు చెబుతున్నారు. డీఈవోపూల్‌లో తెలుగు 20, హిందీ 9, పీఈటీలు 20 మందికి పైగా ఉన్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి శైలజ మాట్లాడుతూ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిచేస్తున్నామన్నారు. మండల విద్యాధికారులకు సమావేశం నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం పక్కాగా బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు.


Get AP Teachers Transfers 2020 Online Application at

నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుల బదిలీల నమోదుకు అవకాశం

0 వ్యాఖ్యలు:

Post a Comment