Friday, November 27, 2020

AP Cabinet today decisions highlight

AP Cabinet today decisions highlight/కేబినెట్ రాష్ట్ర మంత్రి వర్గ భేటీ చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్ చర్చించింది సచివాలయంలో ఏపీ సీఎం జగన్ 


AP Cabinet today decisions highlight


ప్రస్తుతం శీతాకాలమైనా ఏపీలో మాత్రం హాట్ హాట్ గా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ రాష్ట్ర మంత్రి వర్గ భేటీ ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్ చర్చించింది సచివాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఎంతో ఉత్కంఠ నడుమ సాగిన కేబినేట్ సమావేశం ముగిసింది. అనంతరం భేటీలో డిస్కర్షన్ కి వచ్చిన అంశాలపై మీడియాతో మాట్లాడారు మంత్రి పేర్ని నాని, పలు ముఖ్యమైన అంశాలపై కేబినెట్లో చర్చించినట్టు వాటిని తప్పక అమలు పరుస్తామని మంత్రి పేర్ని నాని తెలియజేశారు


కేబినెట్ రాష్ట్ర మంత్రి వర్గ భేటీ చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్ చర్చించింది సచివాలయంలో ఏపీ సీఎం జగన్ ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను మంత్రి కన్నబాబు మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు వివరించారు


రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు.


కడప జిల్లా కోప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్‌, ఎలక్ట్రానిక్ క్లస్టర్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయించిందని కన్నబాబు తెలిపారు.  రాజధాని స్టార్టప్ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నామని, ఏడీపీ లిక్విడేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వడానికి నిర్ణయించినట్లు చెప్పారు. నివర్ తుపాను, భారీ వర్షాలపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు చెప్పారు. 

డిసెంబర్ 15 నాటికి నష్టపరిహారంపై అంచనాలు పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా తుపాను కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు చెప్పారు. ప్రాథమికంగా 30 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. 

13 వేల ఎకరాలలో ఉద్యానవన పంటలు  దెబ్బతిన్నాయన్నారు. డిసెంబర్ నెలాఖరులోపు నష్ట పరిహారం అందించాలని సీఎం సూచించినట్లు కన్నబాబు చెప్పారు. పంట నష్టం వాటిల్లిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామన్నారు. నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామన్నారు. 

పునరావాస శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాట్లు మంత్రి కన్నబాబు తెలిపారు*.


పోలవరంపై కేబినెట్‌లో చర్చ .


ఒరిజినల్‌ డిజైన్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టడానికి కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి కన్నబాబు తెలిపారు. 2017లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ తీసుకునే క్రమంలో.. 2014 రేట్ల ప్రకారం చెల్లిస్తామని, అందుకు అంగీకరించాలని కోరారు*. 


ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు.


ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కన్నబాబు తెలిపారు. 3.144 శాతం డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో 2, 3 డీఏలు చెల్లిస్తామన్నారు. కరోనా సమయంలో ఆపిన మార్చి నెల వేతనాలను డిసెంబర్‌లో, ఏప్రిల్‌ నెలలో పెండింగ్‌ బకాయిలను జనవరిలో అందిస్తామన్నారు

డిసెంబర్ 25న పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపకం కార్యక్రమం ఉంటుందన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా 17 వేల కాలనీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్థలాలు ఇచ్చిన రోజే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ 15 నుంచి వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాదిలోగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, డిసెంబర్ 2న ఆమూల్ పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించన్నట్లు చెప్పారు. ఆ రోజు నుంచే  లీటర్‌ పాలకు అదనంగా రూ.4 చెల్లిస్తామన్నారు. 

డిసెంబర్ 21న సమగ్ర భూసర్వేను సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్, పల్నాడు ప్రాజెక్టుల కోసం ఎస్పీవీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు



కేబినెట్ కీలక నిర్ణయాలు


1) అమరావతిలో భూదందాపై న్యాయ నిపుణులతో చర్చ 

2)ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం 

3)ముఖ్యంగా సీఆర్డీఏలో జరుగుతోన్న అక్రమాలపై చర్యలు

4) పంచాయితీరాజ్ ఎన్నికల నిర్వహణకు కేజినెట్ గ్రీన్ సిగ్నల్ 

5) పంచాయితీరాజ్ ఎలక్షను రిజర్వేషన్లు ఖరారు ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

7) 108 ఆంబెలెన్స్ సర్వీసుల్లో ఎన్నో సమస్యల పునరుద్ధరణ కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం

9) 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం

10)ప్రతీ ఏడాది పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం

మచిలీపట్నం పోర్టును ప్రభుత్వమే నిర్మించేందుకు ఎస్పీవీ ఏర్పాటు. రూ.11,900 కోట్లతో ఆరు దశల్లో మచిలీపట్నం పోర్టు అభివృద్ధి. విభజన చట్టంలో భాగంగా రూ.10,900 కోట్లతో

రామయపట్నం పోర్టు రాజధానిపై హైలెవల్ కమిటీ ఏర్పాటు జీఎన్ రావు, బీసీజీ నివేదికల పరిశీలనకు కమిటీ హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధాని పై నిర్ణయం

AP Cabinet today decisions highlight/కేబినెట్ రాష్ట్ర మంత్రి వర్గ భేటీ చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్ చర్చించి

0 వ్యాఖ్యలు:

Post a Comment