Thursday, September 17, 2020

AP ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తు షురూ

ఉపాధ్యాయుల బదిలీలకు ముందు నిర్వహించే కసరత్తును పాఠశాల విద్య శాఖ చేపట్టింది. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయిస్తారు. గత విద్యా సంవత్సరం ఫిబ్రవరి 29వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉండాలన్నది ఖరారు చేస్తారు. 

AP ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తు షురూ

ఈ మేరకు ఉన్నత పాఠశాలల్లో 200మంది విద్యార్థులకు 9మంది ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. ప్రాథమిక స్థాయిలో 60లోపు ఎంతమంది ఉన్నా ఇద్దర్ని ఆ తర్వాత ప్రతి 30మందికి ఒకరు చొప్పున ఉపాధ్యాయల కేటాయింపు ఉంటుంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల జాబితాల పరిశీలన పూర్తయింది. 



రెండు రోజుల్లో మిగతా జిల్లాల పునర్నియామక ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం జిల్లా విద్య శాఖ వెబ్‌సైట్‌లలో పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలను ఉంచుతారు. బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి.

ఉపాధ్యాయుల బదిలీలకు పాయింట్లు కేటాయింపు ఇలా


గత బదిలీల్లో పెట్టిన పనితీరు ఆధారంగా పాయింట్ల కేటాయింపు పద్ధతిని ఈసారి తొలగించనున్నారు. ఉపాధ్యాయులు పని చేసే పాఠశాల ప్రాంతం, సర్వీసు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలో 1.60లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

జూన్‌ 30 లేదా జులై 1ని కటాఫ్‌ తేదీగా తీసుకొని సర్వీసు లెక్కించే అవకాశం ఉంది. కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు

మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు.

  • పాఠశాల ప్రాంతం హెచ్‌ఆర్‌ఏ 20% కేటగిరి-1కు ఏడాదికి ఒక పాయింటు, 
  • హెచ్‌ఆర్‌ఏ 14.5% ఉంటే వాటికి రెండు, 
  • హెచ్‌ఆర్‌ఏ 12% ఉండే వాటికి మూడు పాయింట్లు ఇస్తారు

బస్సు సదుపాయం లేని ప్రాంతానికి 4పాయింట్లు కేటాయిస్తారు.

AP ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తు షురూ

0 వ్యాఖ్యలు:

Post a Comment