AP 21 నుంచి పాఠశాలల పునఃప్రారంభం 9, 10 తరగతులకు బోధన పునఃప్రారంభం ఉన్నత పాఠశాలల్లో ప్రతిరోజూ 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా జాబ్ చార్టు
AP 21 నుంచి పాఠశాలల పునఃప్రారంభం 9, 10 తరగతులకు బోధన పునఃప్రారంభం
ఈ నెల 21 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, మున్సిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను పునఃప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్.సుబ్బారావు కోరారు.
ప్రతిరోజూ ఉపాధ్యాయులు హాజరయ్యేలా ఎంఈవోలు, ఉప విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
విద్యావారథి అంశంపై మార్గనిర్దేశం చేయడానికి కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపలున్న పాఠశాలల ఉపాధ్యాయులు హాజరై కొవిడ్ నిబంధనలపై విద్యార్థులకు తగు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు.
22 నుంచి 9, 10 విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని.. కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించాలన్నారు.
ఉన్నత పాఠశాలల్లో ప్రతిరోజూ 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా జాబ్ చార్టు రూపొందించుకోవాలని సూచించారు.
తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి వారికి కొవిడ్ నిబంధనలు తెలియజేయాలన్నారు.
అక్టోబర్ 5న చేపట్టే జగనన్న కానుక పంపిణీలో విద్యార్థులకు మాస్కులు అందజేస్తారన్నారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment