టీచర్ల బదిలీల్లో కదిలిక 18నాటికి రేషనలైజేషన్ జాబితా త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం టీచర్ల పునర్విభజన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు
AP టీచర్ల బదిలీల్లో కదిలిక 18 నాటికి రేషనలైజేషన్ జాబితా త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కదలిక వచ్చింది. టీచర్ల పునర్విభజన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ జాబితాలు తయారీకి జిల్లాల వారీ అధికారులను నియమించారు.
జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్విభజన చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29నాటికి పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, యూడైస్ ఆధారంగా కసరత్తు చేస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు, ఎంతమంది టీచర్లను కేటాయించాలో కూడా ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. పాఠశాలలున్న ప్రాంతాలు, అక్కడ ఉపాధ్యాయులు పొందే హెచ్‌ఆర్‌ఏ ప్రాతిపదికగా కేటగిరీ 1, 2, 3, 4 వారీగా జాబితాలను సిద్ధం చేయనున్నారు.
ఆగస్టు 31నా టికి ఒక పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీకి అర్హులు. అలాగే ఐదేళ్లు పూర్తిచేసిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తిచేసిన ఎస్జీటీలు, స్కూలు అసిస్టెంట్లు, ఇతర కేటగిరీ టీచర్లందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే.
ఉపాధ్యాయుల పునర్విభజన జాబితాలు 16లోపు కమిషనర్‌కు అందజేయాలి
ఉపాధ్యాయుల పునర్విభజన జాబితాలు అన్నింటిని ఈ నెల 18నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్య కమిషనర్ షెడ్యూల్ ప్రకటించారు. జిల్లాలో తయారుచేసిన జాబితాలను పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలోని యూడైస్ డేటాతో సరిపోల్చి ధ్రువీకరణ పొందాల్సి ఉంది.
జాబితాల తయారీ అధికారం పూర్తిగా జిల్లాలకే అప్పగిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉన్నందున దానికి చెక్‌పెడుతూ కమిషనర్ కార్యాలయంలో జాబితాలను ధ్రువీకరించుకోవాలని ఆదేశించారు.
ఈ నెల 16వ తేదీన జిల్లా జాబితాలను పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆయా తేదీల్లో కేటాయించిన జిల్లాల అధికారులు ఉదయం 10.30 కల్లా కమిషనర్ కార్యాలయంలోని ఐటీ సెల్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారు 18వ తేదీన ధ్రువీకరిస్తారు
0 వ్యాఖ్యలు:
Post a Comment